అఖిల్ ప్రేయసి గురించి మీకు తెలియని సీక్రెట్స్!

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ప్రేమించిన అమ్మాయి శ్రీయ భూపాల్. ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో పేరున్నఈ డిజైనర్ అఖిల్ ప్రేయసి కాగానే ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆమె గురించి ఆసక్తికర సంగతులు.

1. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షాలిని భూపాల్ కుమార్తె శ్రీయ. జీవీకే రెడ్డి మనుమరాలు. ఈమె న్యూయార్క్ లో ఫ్యాషన్           డిజైనింగ్ కోర్సు చేశారు. ఈమె ఫ్యాషన్ రంగంలో శ్రీయ సమ్ గా అందరికీ పరిచయం.

2. శ్రీయకి చిన్నప్పటి నుంచే కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ఇష్టం. చదువుతూనే తన అభిరుచిని ప్రొఫిషన్ గా మార్చుకున్నారు.

3 . టాలీవుడ్ తారలు శ్రియ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్‌ సింగ్‌లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్   లకు గత రెండేళ్లుగా డ్రస్సులను డిజైన్ చేశారు.

4. ఫిల్మ్ ఫెర్ సౌత్ అవార్డుల కార్యక్రమానికి శ్రీయ అధికారిక కాస్ట్యూమ్ డిజైనర్.

5. “శ్రీయ సమ్” అనే తన బ్రాండ్ పేరును మరణించిన తన తండ్రి కి శ్రీయ అంకితం ఇచ్చారు.

6. అక్కినేని, భూపాల్ కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉంది. ఈ విధంగానే అఖిల్, శ్రీయ స్నేహితులయ్యారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.

7. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే అఖిల్ కంటే శ్రీయ ఒక సంవత్సరం పెద్ద.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus