ఈమధ్యకాలంలో ఏ స్టార్ హీరోకి జరగని స్థాయి అవమానం బాలయ్య సినిమా విషయంలో చోటు చేసుకుంది. ఎంతో ఆర్భాటంగా అన్నీ రాష్ట్రాల్లో ప్రమోషన్స్, కుదిరినన్ని భాషల్లో ఇంటర్వ్యూలు గట్రా చేసిన తర్వాత కూడా డిసెంబర్ 4న ప్రీమియర్లు క్యాన్సిల్ అవ్వడమే కాదు.. డిసెంబర్ 5 రిలీజ్ కూడా జరగలేదు. ప్రస్తుతానికి రిలీజ్ ఎప్పుడవుతుంది అనే క్లారిటీ కూడా లేదు. ప్రీమియర్లు క్యాన్సిల్ అవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ కారణం అంటూ బుకాయించిన 14 రీల్స్ సంస్థ.. సినిమా పోస్ట్ పోన్ విషయంలో మాత్రం ఏం చెప్పాలో తెలియక చేతులెత్తేసింది.
అయితే.. అఖండ 2 విడుదలవ్వడం అనేది బాలయ్య చేతిలో కూడా లేని సమస్య. సోషల్ మీడియాలో కొందరు ఎరోస్ సంస్థకి 27 కోట్లు కట్టి క్లియర్ చేసుకోలేకపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ చెన్నైలో వాళ్లు తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ అనేది కేవలం 27 కోట్ల రూపాయలకి కాదు.. దానికి ఆరేళ్ళపాటు వడ్డీ కూడా కలిపి. ఇంచుమించుగా అదే 50 కోట్లు ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకుని 14 రీల్స్ సంస్థతో తీరని లావాదేవీలు ఉన్న ఇంకొందరు కూడా తమ అప్పులు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అన్నీ కలిపి ఇంచుమించుగా 70 కోట్ల రూపాయలు పై మాటే అని తెలుస్తోంది.
ఎంత రూలింగ్ పార్టీ అయినప్పటికీ.. మరీ ఇప్పటికిప్పుడు 70 కోట్ల రూపాయలని ఒక సినిమా విడుదల కోసం వెచ్చించడం అనేది జరిగే విషయం కాదు. మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే రామ్ ఆచంట మీడియా ముందుకు రావాలి. అది జరిగే పని కాదు కాబట్టి.. కనీసం రిలీజ్ విషయంలో క్లారిటీ అయినా ఇవ్వాలి. అసలే పోస్ట్ పోన్ అవ్వడం అనేది నెగిటివ్ ఇష్యూ కావడం, తెలంగాణలో కనీసం బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వకపోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుంటే.. సినిమాని యుద్ధప్రాతిపదికన ఈ వారంలోనే రిలీజ్ చేసే బదులు.. అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుని వచ్చే శుక్రవారం రిలీజ్ చేయడం సబబు. అది కూడా ఈ 70 కోట్ల రూపాయల లావాదేవీలు సర్దుమణిగి, కోర్టు నుండి పర్మిషన్, ఎరోస్ సంస్థ నుండి NOC వంటివి వస్తేనే. లేకపోతే.. మళ్లీ ఏదో మ్యానేజ్మెంట్ కోసం ప్రస్తుత కోర్టు ఆర్రర్ నుండి పర్మిషన్ తెచ్చుకున్నా.. ఎరోస్ సంస్థ సుప్రీం కోర్టుకి వెళ్లడానికి రెడీగా ఉంది. మరి ఇన్ని సమస్యల నడుమ 14 రీల్స్ ప్లస్ సంస్థను కాపాడే నాథుడు ఎవరు?, “అఖండ 2” రిలీజ్ ఎప్పుడు? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.