ప్రేమకథల యందు ‘7/జి బృందావన్ కాలనీ’ వేరయా అంటుంటారు. ఆ సినిమా చూస్తే.. ఎక్కడా కృత్రిమంగా కనిపించదు. మాటలు, చేతలు.. ఇలా అన్నీ సహజంగా ఉంటాయి. హీరోయిన్‌ను, హీరోను మన పక్కింటిలోనో, వీధి చివరనో, పక్క వీధిలోనో చూసినట్లు ఉంటుంది. అందుకే ఆ సినిమా అంత విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత హీరో, హీరోయిన్‌కు పెద్దగా అవకాశాలు రాకపోయినా.. సినిమా మాత్రం మనకు ఇంకా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.
2004లో విడుదలై యువతరాన్ని ఓ ఊపు ఊపేసిన ‘7/G బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్ తీయాలని ఎ.ఎం.రత్నం అనుకుంటున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం బాషా బేధం లేకుండా, సౌత్‌లో ప్రతి చోటా హిట్టయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నామని ఎ.ఎం.రత్నం ధ్రువీకరించారు. అయితే దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ల సంగతేంటి? అనేది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రానికి తొలి సినిమాను డైరక్ట్ చేసిన సెల్వ రాఘవనే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
తొలి సినిమలో నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఇప్పుడు ఔటాఫ్ యాక్టింగ్ అయిపోయారు. సోనియా అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. రవికృష్ణ అయితే కనిపించడం లేదు. మరిప్పుడు కొత్త సినిమా కోసం ఎ.ఎం.రత్నం ఎవరిని తీసుకొస్తారో చూడాలి. ఒకవేళ సినిమా వస్తే అందులో పాత పాత్రలు కనిపిస్తాయా అనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే రవికృష్ణ.. ఎ.ఎం.రత్నం తనయుడే. 2011 తర్వాత ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు.
ఆ విషయం పక్కనపెడితే ప్రస్తుతం ఎ.ఎం.రత్నం పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. కొత్త సంవత్సరానికి గానీ, సంక్రాంతికి కానీ టీజర్ రావొచ్చు అని కూడా అంటున్నారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?