సినిమాల్లో మెప్పించిన గురువులు

  • March 10, 2018 / 01:10 PM IST

ఒక చదువు విషయంలోనే కాదు.. ఏ విద్యనైనా నేర్పించే వారని గౌరవించుకోవడం మన సంప్రదాయం. అలాంటి గురువులపై సినిమాల్లో కొంతమంది దర్శకులు జోకులు వేసి నవ్వించినా.. మరికొంతమంది మాత్రం జీవిత పాఠాలు చెప్పించారు. అలా వెండితెరపై గుర్తిండిపోయే గురువులపై ఫోకస్…

1. వెంకటేష్ (సుందరకాండ)కాలేజీ విద్యార్థులతో గురువు ఒక ఫ్రెండ్ గా ఉండాలని కె రాఘవేంద్రరావు సుందరకాండ సినిమాలో వెంకటేష్ పాత్ర ద్వారా చెప్పించారు. ఎక్కడ సరదాగా ఉండాలో.. ఎక్కడ సీరియస్ గా ఉండాలో వెంకీ ఈ చిత్రంలో చక్కగా నటించి చూపించారు.

2. చిరంజీవి (మాస్టర్)మాస్టర్ సినిమాలో చిరంజీవిని చూసిన తర్వాత ప్రతి కాలేజీల్లో ఇలాంటి లెక్చరర్ ఒకరు ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి కోరుకున్నారు. అలాగా చిరు నటించి మెప్పించారు.

3. కమలినీ ముఖర్జీ (హ్యాపీ డేస్) స్టూడెంట్స్ లెక్చరర్స్ పై ఆకర్షణకు గురికావడం సహజం. అది వయసు చేసే తప్పు. హార్మోన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు వారిని సరైన దారిలో నడిపించడం కూడా లెక్చరర్స్ బాధ్యత. హ్యాపీ డేస్ చిత్రంలో కమలినీ ముఖర్జీ పాత్ర ఆ విధంగా నడుచుకొని ఆదర్శంగా నిలిచింది.

4. సుమంత్ (గోల్కొండ హై స్కూల్)చదువుల్లో టాపర్ గా నిలవడానికి మాత్రమే కాదు క్రీడా మైదానంలో విజేతగా నిలవాలన్నా ప్రతిభ గలిగిన గురువు కావాలి. అలాంటి గురువుగా గోల్కొండ హై స్కూల్ సినిమాలో సుమంత్ నటించి ఆకట్టుకున్నారు.

5. వెంకటేష్ (గురు) మంచి గురువు కోసం విద్యార్థులు ఎంతదూరమైనా వెళ్తుంటారు. ఇది సహజం. అయితే మంచి స్టూడెంట్ కోసం వెతికే గురువులు కూడా ఉంటారు. అటువంటి గురువుగా గురు సినిమాలో వెంకటేష్ గుర్తుండిపోయారు.

6. రాజేంద్ర ప్రసాద్ (ఓనమాలు) విద్యార్థి దశలోనే మార్కులు ఎక్కువగా ఎలా తెచుకోవాలో అనే చెప్పడంతో పాటు.. జీవితంలో ఎక్కువమార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పే గురువులు అతి తక్కువమంది ఉంటారు. అటువంటి గురువు పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించేసారు. ఓనమాలు సినిమాలో అతని నటనకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతారు.

7. గురురాజ్ మానేపల్లి (హ్యాపీ డేస్) కాలేజీ లైఫ్ అంటే ఏంటో హ్యాపీ డేస్ చిత్రంలో తక్కువ మాటలతో గురురాజ్ మానేపల్లి విద్యార్థులకు కళ్లకు కట్టారు.

8. ఎంఎస్ నారాయణ (పిల్ల జమీందార్) పాఠాలు కావాలంటే పుస్తకాల్లో దొరుకుతుంది.. కానీ సంస్కారం మాత్రం కొంతమంది గురువులు మాత్రమే నేర్పిస్తారు. అటువంటి గురువుగా పిల్ల జమీందార్ చిత్రంలో ఎంఎస్ నారాయణ నటించి కన్నీరు పెట్టించారు.

ఇలా వెండితెరపై జీవిత పాఠాలు నేర్పించిన గురువులు ఎంతోమంది ఉన్నారు. మీరు మెచ్చిన ఆ గురువుల పేర్లను కామెంట్స్ రూపంలో తెలపండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus