Major Movie: తొలిసారిగా 88 ప్రీమియర్ షోలకు హౌస్ ఫుల్ కలెక్షన్స్?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా నటుడు అడవి శేషు ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మొదటి షో నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన ఎంతో మంది నెటిజన్లు సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోగా తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది.

దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించలేని రికార్డును మేజర్ సినిమా సాధించిందని చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందే పలు నగరాలలో ఈ సినిమా ప్రివ్యూ షో వేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రివ్యూ షో లకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.మేజర్ సినిమాకు దేశవ్యాప్తంగా 88 ప్రీమియర్ షోలకు .. మొత్తం హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అవటంతో ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా దక్కని ఘనత మేజర్ సినిమాకు దక్కిందని చెప్పాలి.

ఈ సినిమా 88 ప్రీమియర్ షోలకు హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించడం అంటే గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంటున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభిత ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్లస్ ఎస్ మూవీస్‌,

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus