Bigg Boss 5 Telugu: 8వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో అత్యంత నాటకీయంగా జరిగేవి రెండే రెండు. ఒకటి నామినేషన్, రెండు ఎలిమినేషన్. ఈరెండూ బిగ్ బాస్ వీక్షకులకి ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇందులో భాగంగా నామినేషన్స్ అప్పుడు రకరకాల ట్విస్ట్ లు ఇస్తుంటాడు బిగ్ బాస్. ఈసారి 8వ వారం కూడా ఇలాంటి ప్రక్రియనే పెట్టాడు. ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడని, అందులో లెటర్స్ ని క్రష్ చేస్తూ నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఇక్కడే ఈసారి నామినేషన్స్ లో రచ్చ నెలకొంది. సిరి, ఇంకా ప్రియాంకలు ఏడూస్తూ ఎమోషనల్ అయ్యారు.

ప్రోమోలో చూపించన దాన్ని బట్టీ చూస్తే ఈసారి కూడా గట్టిగానే నామినేషన్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం. ఈవారం అనీమాస్టర్ కూడా నామినేషన్స్ లో ఉందనే అంటున్నారు. అయితే, అనీమాస్టర్ కి సండే గేమ్ లో వచ్చిన పవర్ వల్ల సేఫ్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరం.

ఇంటిసభ్యులకి వాళ్ల కుటుంబ సభ్యుల నుంచీ ఉత్తరాలు వస్తాయి. వాటిలో ఎవరికైతే ఉత్తరాలు ఇవ్వరో వాళ్లు నామినేట్ అవుతారు. ఎవరికైతే ఇస్తారో వాళ్లు సురక్షితులు అవుతారు. ఇక్కడే షణ్ముక్ సిరికి లెటర్ ఇచ్చాడా లేదా అనేది చాలా ఆసక్తికరంగా ప్రోమోలో చూపించారు. ఈవారం సిరి, శ్రీరామ్, మానస్, రవి, లోబో, షణ్ముక్ వీళ్లు ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇక్కడే శ్రీరామ్ చంద్ర ట్విస్ట్ ఉంటుందని సమాచారం. మరి చూద్దాం నామినేషన్స్ లో ఏం జరగబోతోంది అనేది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus