పవన్ కల్యాణ్ కెరీర్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు కూడా వరుసగా సినిమాలు వచ్చింది లేదు, ఆ మాటకొస్తే చేసింది లేదు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా అనే కాన్సెప్ట్‌లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు వివిధ కారణాల వల్ల వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు, నటిస్తున్నాడు.. ఇప్పుడు రిలీజ్ చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, పవన్ షూటింగ్‌లు చేస్తే వచ్చే ఎనిమిది నెలల్లో నాలుగు సినిమాలు వస్తాయి అంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుత ప్లానింగ్ ఇదేనట.
ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు (Pawan Kalyan) పవన్ కల్యాణ్. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి అనుకున్న సినిమాలు పూర్తి చేసి, అటు వెళ్లిపోవాలని చూస్తున్నాడు. ఆ లెక్కన పవన్ ఇప్పుడు నాలుగు సినిమాలు పూర్తి చేయాలి. ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’, ‘వినోదాయ చిత్తాం’ రీమేక్. ఈ నాలుగు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాల విడుదలకు సంబంధించి పవన్ అండ్ కో. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అఫీషియల్‌గా, అనఫీషియల్‌గా ప్రచారంలో ఉన్న ఆ సినిమా రిలీజ్ డేట్స్ చూస్తుంటే వచ్చే ఎనిమిది నెలల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి అని చెప్పొచ్చు. వాటిలో తొలుత వచ్చే సినిమా #PKSDT. అంటే ‘వినోదాయ చిత్తాం’ రీమేక్.
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. మామ అల్లుళ్ల కలయికలో వస్తోన్న ఈ సినిమాను జూలై 28 , 2023న రిలీజ్ చేస్తున్నామని టీమ్ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు టీమ్ వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇక ఆ తర్వాతి సినిమా అంటే ‘హరి హర వీరమల్లు’ అని చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ రెండూ అయ్యాక డీవీవీ దానయ్య – సుజీత్‌ల సినిమా ‘OG’ ఉంటుంది. ఈ వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాని అతి తక్కువ డేట్స్‌లో పూర్తి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2023లో విడుదల చేస్తారట. ఇక మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ డైరక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్. ఈ సినిమాను 2024 సంక్రాంతికి తీసుకొస్తారని టాక్.
వచ్చే ఏడాది సమ్మర్‌లో ఏపీలో ఎన్నికలు ఉంటాయని టాక్. అంటే దానికి కనీసం రెండు, మూడు నెలల ముందు పవన్ అటు వెళ్లిపోవాలి. అందుకే సంక్రాంతికి ఆఖరి సినిమా అనే ప్లాన్‌లో ఉన్నారట. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఈ లెక్క.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!