Mouli: వివాదంలో 90s సిరీస్ మౌళి!

ఇటీవల విడుదలైనటువంటి వెబ్ సిరీస్ లలో 90 s వెబ్ సిరీస్ ఒకటి శివాజీ వాసుకి ప్రధాన పాత్రలలో నటించినటువంటి ఈ వెబ్ సిరీస్ 90 లలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వారి జీవన విధానం ఎలా ఉందనే విషయాలన్నింటినీ కూడా చూపించారు. ఈ సిరీస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ సిరీస్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సిరీస్ లో మౌళి పాత్రకు ఎంతో ప్రాధాన్యత లభించింది. శివాజీ కుమారుడిగా మౌళి ఈ సిరీస్ లో నటించారు. అయితే తాజాగా మౌళి టాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఏపీ రాజధాని గురించి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఒక వేదికపై మౌళి (Mouli) మాట్లాడుతూ తన చేతిలో ఏమీ లేదని అయితే మీ అందరికీ ఒక మ్యాజిక్ చూపిస్తాను అంటూ చేతిని మూసి అనంతరం తెరిచి చూపించారు. నా చేతిలో ఉన్నది మాయమైందని అది ఏపీ క్యాపిటల్ మీకు ఎక్కడ వెతికిన దొరకదు అంటూ ఈ సందర్భంగా మౌళి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చలకు మొదలయ్యాయి. ఈ విషయంపై టిడిపి నేతలు కార్యకర్తలు ఏపీకి రాజధాని కూడా లేకుండా చేశారు ఇలాంటి అవమానం మరొకటి లేదు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను అతని చేత శివాజీ అనిపించి ఉంటారు అంటూ వైసిపి నేతలు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఈయన చేసినటువంటి ఈ కామెంట్ల ద్వారా వివాదంలో నిలిచారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus