Gauri Kishan: 96 చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామర్ లుక్కులో అరాచకం!

తమిళ్ సూపర్ హిట్ చిత్రం 96 ప్రేక్షకుల హృదయాలను కదిలించిన మూవీగా నిలిచింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తెలుగులో ఈ చిత్రాన్ని జాను (Jaanu) పేరుతో రీమేక్ చేయగా, శర్వానంద్ (Sharwanand), సమంత (Samantha Ruth Prabhu) కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గౌరి కిషన్ (Gouri Kishan) గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Gauri Kishan

గౌరి కిషన్ (Gauri Kishan) ఆ చిత్రంలో తన నాచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చిన్నదైనా చాలా మందికి గుర్తుండిపోయింది. ఇప్పుడు గౌరి తన ముద్దుగుమ్మ ఇమేజ్‌ని మార్చుకొని, ఫుల్ గ్లామర్ షో చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గౌరి ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాలలో బిజీగా ఉన్నప్పటికీ, తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.

తెలుగులో గౌరి కిషన్ శ్రీదేవి శోభన్ బాబు (Sridevi Shoban Babu) అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ కారణంగా ఆమె తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టకుండా ఎక్కువగా వెకేషన్‌లు, ఫోటోషూట్లలోనే బిజీగా ఉంటుంది. స్టైలిష్ ఫోటోలు, ఇతర గ్లామరస్ లుక్స్ షేర్ చేస్తూ తన అభిమానులను కొత్తగా ఆకట్టుకుంటోంది.

గౌరి తన గ్లామర్ షోతో సౌత్ ఇండస్ట్రీలో కొత్త అవకాశాలను అందుకోవాలని చూస్తోంది. వెకేషన్స్ లో షేర్ చేసిన తాజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ సారి సింపుల్ గర్ల్‌గా కనిపించిన గౌరి ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్‌గా మారడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె మరింత బిజీగా మారి స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇలాంటి గ్లామర్ లుక్స్ తో అమ్మడి లక్కు మారుతుందో లేదో చూడాలి.

అక్కడ రెండో మర్యాద రామన్న.. మృణాల్ కు గోల్డెన్ ఛాన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus