ఇండియన్ సినీ పరిశ్రమలో బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది అంటుంటారు. అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లను రాబడుతుంటాయి. అయితే కరోనా దాటికి మూతపడిన అక్కడి థియేటర్లు దాదాపు రెండేళ్ళ వరకు తెరుచుకోలేదు. ఎట్టకేలకు నిన్న ‘బెల్ బాటమ్’ తో కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అస్సాం.. వంటి పలు చోట్ల పక్కన పెడితే దాదాపు 800కి పైగా థియేటర్లలో నిన్న విడుదలైంది ‘బెల్ బాటమ్’ రిలీజ్ అయ్యింది.
సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.స్క్రీన్ ప్లే పరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమా సూపర్ అంటూ కితాబిచ్చారు ప్రేక్షకులు. కానీ కలెక్షన్లు మాత్రం అత్యంత ఘోరంగా నమోదయ్యాయి. మొదటిరోజు ఈ చిత్రానికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే షేర్ నమోదయ్యింది. అక్షయ్ కుమార్ సినిమాలకు గతంలో 10వ రోజున కూడా ఇంత ఘోరంగా కలెక్షన్లు నమోదయ్యి ఉండేవి కావేమో. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటి అంటే.. తెలుగు రాష్ట్రాల నుండీ రూ.50 లక్షల పైగా షేర్ నమోదయ్యింది.
అంటే నార్త్ మొత్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది రూ.1.5 కోట్లు మాత్రమే అన్న మాట. ఈ సినిమా కలెక్షన్లు చూసాక.. బాలీవుడ్ దర్శకనిర్మాతల్లో హోప్ పోయింది. మంచి రేటు వస్తే ఓటిటిలకు తమ సినిమాని ఇచ్చేసుకోవడమే బెటర్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారని వినికిడి.దీంతో మన తెలుగు సినిమా ప్రేక్షకుల గొప్పతనం ఏంటో మరోసారి రుజువైంది.