దగ్గుబాటి రానా ఇటీవల ‘విరాటపర్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం మినిమమ్ కూడా నమోదు కాలేదు. క్రేజ్ ఉన్న హీరోల సినిమాలకి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ రానా నటించిన ‘విరాటపర్వం’ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.2 కోట్ల లోపు షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఇలాంటి టాక్ వస్తే సినిమాకి ఓపెనింగ్స్ కు కొదువ ఉండకూడదు. కానీ ‘విరాట పర్వం’ ఏ ఏరియాలో కూడా మినిమమ్ కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. దీంతో రానా మార్కెట్ కు ఏమైంది? అనే చర్చ మొదలైంది. ‘విరాట పర్వం’ చిత్రం మాత్రమే కాదు గతేడాది రిలీజ్ అయిన ‘అరణ్య’ కూడా అంతే. ఈ చిత్రం కూడా మొదటి వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది.
‘భీమ్లా నాయక్’ ని రానా సినిమాగా పరిగణించలేము. అది పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టామినా పై నమోదైన ఓపెనింగ్స్. అందుకే దాన్ని మల్టీస్టారర్ గా కాకుండా సింగిల్ హీరో సినిమాగా మార్చేశారు. రానా వలనే ఆ చిత్రంలో పవన్ ను ఎక్కువ హైలెట్ చేయడానికి ఆస్కారం దొరికింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ‘అరణ్య’ ‘విరాటపర్వం’ చిత్రాలు రానా మార్కెట్ బాగా పడిపోయింది అని ప్రూవ్ చేసినట్టు అయ్యింది.
అతను ఇకనైనా ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘ఘాజీ’ వంటి చిత్రాలు చేస్తే బెటర్. లేదంటే మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం రానా కి కూడా అర్థమైనట్టు ఉంది. అందుకే ఇక నుండీ ప్రయోగాత్మక చిత్రాలు చేయను అని చెప్పకనే చెప్పాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!