Kriti Sanon: కృతి సనన్ కు ఇది పెద్ద సవాలే..!

తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుంది అని ఆనందించేలోపు… ఇక్కడి నటీనటులను పక్కన పెట్టి ఎక్కువగా బాలీవుడ్ నటీనటులకు దర్శకనిర్మాతలకు పెద్దపీట వేయడం అన్నది కొంత బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. అయితే హీరోయిన్ల విషయంలో ఇది కొత్త పద్ధతి అయితే కాదు. చాలా కాలం నుండి ఉన్నదే.ఇక్కడ కనుక హీరోయిన్లు సక్సెస్ కాకపోతే వెంటనే తిరిగి బాలీవుడ్ చెక్కేసి అక్కడ సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి భామల్లో కృతి సనన్ కూడా ఉన్నారు.

తెలుగులో ‘1 నేనొక్కడినే’ ‘దోచేయ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. రెండు సినిమాల్లోనూ సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఇక్కడ ఎక్కువ కాలం రాణించలేకపోయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ నటించినప్పటికీ.. ఇది హిందీ సినిమానే..!అతను బాలీవుడ్లో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఈ సినిమాలో కృతి సనన్.. సీత అలియాస్ జానకి పాత్రలో కనిపిస్తుంది.

సహజంగా కృతి సనన్ (Kriti Sanon) చాలా మంచి నటి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తుంది. కాకపోతే ఆమెకు బాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే వచ్చాయి. ‘ఆదిపురుష్’ లో మాత్రం ఆమెకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అయితే సీత అనే పాత్రని ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో అలియా భట్ కూడా పోషించింది. ఆ సినిమాలో ఆమె కనిపించింది కాసేపే అయినా చాలా బాగా నటించి ప్రశంసలు అందుకుంది. మరి కృతి సనన్ ఆమెను మరిపించేలా చేయగలదా? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus