బాలయ్య కోసం అనిల్ రావిపూడి ఏదో పెద్దదే ప్లాన్ చేశాడంటున్న ఫ్యాన్స్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్, కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు.. బాలయ్య తన 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే..

షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది – సాహు గారపాటి నిర్మిస్తుండగా.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా.. కాజల్ అగర్వాల్ ఆయనకు తొలిసారి జోడీగా నటిస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది..

బాలయ్య నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాలతో పాటు.. ఆయన ఇమేజ్‌కి తగ్గ కథ, కథనాలతో.. నటసింహాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవతార్‌లో చూపిస్తూనే.. తన మార్క్ కామెడీ కూడా ఉంటుందని.. బాలయ్య కామెడీ చేయకపోయినా కామెడీ అనేది కనిపిస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు.. 30+ వయసులో జైలుకెళ్లి, 50 సంవత్సరాలు పైబడిన తర్వాత విడుదలయ్యే క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి..

ఇదిలా ఉంటే ఈమధ్య శ్రీలీల షూట్‌లో జాయిన్ అయిన విషయం తెలియజేస్తూ టీమ్ ఓ పోస్టర్ వదిలారు.. దానిలో బాలయ్య చేతిమీద యారో (బాణం) మార్క్ లాంటి టాటూ ఉంది.. అది చూసి అనిల్ రావిపూడి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడనుకున్నారు ఫ్యాన్స్.. అయితే ఆ టాటూ బాలయ్య మోచేతి వరకు ఉన్నట్టు అనిపిస్తుంది.. ‘ఆహా’ ఇండియన్ ఐడల్‌కి బాలయ్య స్పెషల్ జడ్జిగా అటెండ్ అవబోతున్నాడు.. సరికొత్త మేకోవర్‌లో ఎప్పటిలానే హై ఎనర్జీతో బాలయ్య అదరగొట్టనున్నాడని ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది..

ఇక షూటింగ్‌కి సంబంధించిన పిక్స్‌లో బాలయ్య చేతిపైన ఉన్న టాటూలో సింహం గుర్తు కూడా కనిపిస్తోంది.. చూస్తుంటే బాలయ్య క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయ్యేలా టాటూ ఉండనుందని.. అనిల్ రావిపూడి పవర్ ఫుల్‌గా బాలయ్య పాత్ర తీర్చిదిద్దిఉంటాడంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus