Jr NTR : ఆ వార్తల వల్ల తారక్ హర్ట్ అవుతున్నారా?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ కు గుర్తింపు దక్కగా భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రకటించిన ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఆ ఇంటర్వ్య్యూలలో రాజకీయాలకు సంబంధించి ప్రస్తావించడానికి ఎన్టీఆర్ ఇష్టపడటం లేదు.

2024 ఎన్నికలకు తారక్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తిస్థాయిలో దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల ద్వారా అభిమానులకు మరింత చేరువ కావాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తుండటం గమనార్హం. అయితే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తారక్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. కొందరు తారక్ పేరును పాజిటివ్ గా ప్రస్తావిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా ప్రస్తావిస్తున్నారు. అయితే పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ అంతకంతకూ ఎదుగుతున్న సమయంలో తారక్ పేరును రాజకీయాల్లో భాగంగా ప్రస్తావించడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

తారక్ కు ఆసక్తి ఉంటే పాలిటిక్స్ లోకి వస్తారని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీల రాజకీయ నాయకులు తారక్ పేరును ప్రస్తావించడం వల్ల తారక్ కెరీర్ కు నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. కొరటాల శివ సినిమా కోసం తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హిందీలో తారక్ మార్కెట్ పెరగగా

తర్వాత సినిమాలతో బాలీవుడ్ మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. యూత్ లో తారక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయాలకు సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలవడం ఎన్టీఆర్ కు కూడా ఇష్టం లేదని ఈ వార్తల వల్ల ఎన్టీఆర్ హర్ట్ అవుతున్నారని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus