Ameesha Patel: అమీషాను పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తి!
- January 3, 2022 / 05:58 PM ISTByFilmy Focus
బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ ‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘నాని’, ‘నరసింహుడు’ వంటి సినిమాలతో తెలుగులో పాపులర్ అయింది. కొంతకాలంగా ఈ బ్యూటీ దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఫైజల్ 41వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..’ అంటూ అమీషా ట్విట్టర్ వేదికగా ప్రియుడికి విషెస్ కూడా చెప్పింది. దీనికి ఫైజల్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అయింది. అమీషాకు ముందుగా థాంక్యూ చెప్పిన అతడు.. పబ్లిక్ గా నీకు ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ సోషల్ మీడియా వేదికగా అడిగాడు. కానీ కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అప్పటికే నెటిజన్లు ఈ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

ఇదిలా ఉండగా.. ఫైజల్ గతంలోనే జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకి గుండెపోటు రావడంతో 2016లో చనిపోయారు. ఆ తరువాత నుంచి అమీషాను ప్రేమించడం మొదలుపెట్టాడు ఫైజల్. అతడికంటే అమీషా వయసులో నాలుగేళ్లు పెద్దది. ఇక సినిమాల విషయానికొస్తే.. అమీషా ప్రస్తుతం సన్నీ డియోల్ పీరియాడిక్ డ్రామా ‘గద్దర్ 2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఉతకర్ష్ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనీల్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy bday my darling @mfaisalpatel … love uuuuu … ❤️💖💖💞💓💘have a super awesome year ❤️💖💖💖 pic.twitter.com/Yworua1hLv
— ameesha patel (@ameesha_patel) December 30, 2021
2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!












