వీడియోలో క్యాబ్ డ్రైవర్ గురించి ఆ నటి ఏం చెప్పిందంటే.?

సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు సాధారణంగా ఫ్యాన్స్, ఆడియన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు.. కలిసి మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.. కానీ ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఏకంగా ఓ నటి లగేజీతో పారిపోయాడు.. ఊహించని ఈ సంఘటనకి ఆ నటి షాక్‌కి గురైంది.. తనకు జరిగిన ఈ చేదు అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. ఉర్ఫీ జావేద్.. టెలివిజన్ యాక్ట్రెస్, హిందీ ఓటీటీ బిగ్ బాస్‌లో పార్టిసిపెట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది..

యాడ్స్, వీడియో సాంగ్స్ చేస్తుంటుంది.. అమ్మడు చిత్ర విచిత్రమైన వేషదారణలో కనిపించి చాలా సార్లు ట్రోలింగ్‌కి గురైంది కానీ వెరైటీ డ్రెస్సులు వెయ్యడం మాత్రం మానదు.. మొన్ననే ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది.. టీషర్ట్, నిక్కర్‌లా ఉన్న ప్యాంటు వేసుకుంది.. దీంతో.. ‘‘టీషర్ట్ ఉల్టా (తిరగేసి) వేసుకున్నావా?.. ప్యాంట్ ఏంటి షార్ట్స్ కంటే చిన్నగా ఉంది.. ఇలాంటి డ్రెస్సులేసుకోవాలని ఎలా అనిపిస్తుంది?.. అందరి చూపులు నీ వైపు తిప్పుకోవాలనే కదా’’ అంటూ ఓ ఆట ఆడుకున్నారు నెటిజన్స్..

మేటర్ ఏంటంటే.. ఉర్ఫీ, ఢిల్లీలో తను ఉండే ఏరియా నుండి ఎయిర్ పోర్ట్‌కి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది.. దారిలో భోజనం చేయడానికని ఓ రెస్టారెంట్ దగ్గర కార్ ఆపారు.. ఉర్ఫీ లోపలికి వెళ్లగానే డ్రైవర్ బాబు ఆమె సామానుతో పరారయ్యాడు.. దీని గురించి వివరిస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసిందామె.. ఇంకో హైలెట్ ఏంటంటే.. ఆమె ఉబర్ సేఫ్టీ టీమ్‌కి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా డ్రైవర్ తాగేసి తనను దుర్భాషలాడాడని, 17 సార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయని.. కూడా చెప్పుకొచ్చింది..

‘‘ఈ రోజు నాకు వరస్ట్ ఎక్స్‌పీరియెన్స్ జరిగింది.. ట్యాక్సీ డ్రైవర్ నా లగేజీతో మాయమైపోయాడు.. దాదాపు రెండు గంటల తర్వాత వచ్చాడు కానీ, అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్నాడు.. ఉబర్.. మీరు అమ్మాయిల విషయంలో కాస్త సేఫ్టీ తీసుకోవాలి’’ అని చెప్పుకొచ్చింది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. ‘మంచి ఎక్స్‌పీరియెన్స్.. నీకు ఇలా జరగాల్సిందే’, ‘మెట్రో యూజ్ చేయ్.. చాలామంది నీతో సెల్ఫీలు తీసుకుంటారు.. దాంతో నీకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది’.. ‘అందుకే ఆటోలు చాలా బెస్ట్.. ఈసారి ఆటో బుక్ చేసుకో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus