Prabhas: ప్రభాస్ మూవీకి అదిరిపోయే క్లాస్ టైటిల్.. ఇదే ఫిక్స్ చేస్తారా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ అనే సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అసలు టైటిల్ కు సంబంధించి క్లారిటీ రానుంది. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ సినిమా కథకు సంబంధించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రాజెక్ట్ కాలచక్ర అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. త్వరలో ఈ టైటిల్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ప్రభాస్ మూవీకి ఈ అదిరిపోయే క్లాస్ టైటిల్ ను ఫిక్స్ చేస్తే ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తారు.

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ఉండటంతో ఆ సినిమాలకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.

ప్రాజెక్ట్ కే సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఇతర భాషల నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆకాశమే హద్దుగా ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా నాగ్ అశ్విన్ కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి భవిష్యత్తులో వచ్చే అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus