Lucifer remake Update: ‘లూసీఫర్’ రీమేక్ కు సంబంధించి క్రేజీ అప్డేట్..!

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసీఫర్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆల్రెడీ ‘లూసీఫర్’ తెలుగులో డబ్ అయినప్పటికీ…కొన్ని మార్పులతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయ్యారు.ఇందుకు గాను.. రీమేక్ లకు కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన తమిళ దర్శకుడు మోహన్ రాజా ని ఈ రీమేక్ కు డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ మరియు ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అయితే కొద్ది రోజులుగా ‘లూసీఫర్’ రీమేక్ ఆగిపోయింది అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.ఈ వార్తల పై చిత్ర యూనిట్ సభ్యులు ఏదో విధంగా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న దర్శకుడు మోహన్ రాజా పుట్టినరోజు నాడు చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడికి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ ను డిజైన్ చేసి ట్వీట్ వేశారు. అలాగే దర్శకుడు మోహన్ రాజా కూడా ఓ సందర్భంలో.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైన తమన్ ఆల్రెడీ రెండు పాటలను కూడా కంపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.అయితే తాజాగా..

‘ఈరోజు నుండి మళ్ళీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి’ అంటూ ‘చిరు 153’ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడంపై అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. ‘ఈ ప్రాజెక్టు ఆగిపోయింది’ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే చిత్ర యూనిట్ సభ్యులు ఈ అప్డేట్ ఇచ్చినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో దర్శకుడు మోహన్ రాజా కలిసి దిగిన ఫొటోలను కూడా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus