Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఖుషీ చేసే అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ బుజ్జి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా గడుపుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది.జూలై 15 నుండీ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ఇక దీని తర్వాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ నుండీ ప్రారంభం కానుందని వినికిడి.

పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా దాదాపు ఖరారు అయిపోయినట్టే అని ఇండస్ట్రీ టాక్. మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట.. కానీ ఎవరిని ఫైనల్ చేస్తారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. మహేష్- త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను మే 31న మహేష్ తండ్రి కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ టైములో కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడైన పాత్రికేయులు బి.ఎ.రాజు గారు కాలం చేయడం

మరియు కరోనా సెకండ్ వేవ్ వల్ల జనాలంతా భయబ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో మహేష్ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లు ఇవ్వలేదు. అయితే ఆగష్ట్ 9న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున త్రివిక్రమ్ మూవీ నుండీ రెండు అప్డేట్ లు రానున్నాయట. టైటిల్ అనౌన్స్మెంట్ తో కూడుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు చిన్న గ్లిమ్ప్స్ కూడా విడుదల చేస్తారట చిత్ర యూనిట్ సభ్యులు. మరోపక్క ‘సర్కారు వారి పాట’ టీం కూడా మహేష్ అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ను సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus