Star Actress: మరో నటి బ్రతికుండగానే చనిపోయింది అంటూ ఫేక్ వార్తలు.. ఘోరం

ఈ మధ్య కాలంలో కొంతమంది సినీ ప్రముఖులు బ్రతికుండగానే చనిపోయారు అంటూ ఫేక్ వార్తలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. అవి ఎలా పుట్టుకువస్తున్నాయి అనేది కచ్చితంగా ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. కొంతమంది పేర్ల వల్ల కన్ఫ్యూజ్ అయ్యి వేరే నటులు చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇంకొంతమంది కావాలనే ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అవుతుంది. అయితే ఇలాంటి ఫేక్ వార్తలకి స్వయంగా ఆ నటీనటులు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి (Jigyasa Singh) బ్రతికుండగానే చనిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. బాలీవుడ్‌లో పాపులర్ షో తప్కీ ప్యార్ తో పాపులర్ అయ్యింది నటి జిగ్యాసా సింగ్.ఇది సక్సెస్ కావడంతో తప్కీ ప్యార్ కి 2 లో కూడా ఆమె భాగమైంది. వాణి అనే పాత్రతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది జిగ్యాసా సింగ్. అయితే ఆమె కారు ప్రమాదంలో చనిపోయినట్టు ఫేక్ ప్రచారం మొదలైంది. అవి పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందారు.

దీంతో జిగ్యాస స్పందించాల్సి వచ్చింది. ” నేను చనిపోయాను అంటూ వస్తున్న వార్తలు అన్నీ ఫేక్. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకు వచ్చాయో నాకు తెలీదు. నేను బతికే ఉన్నాను! మీరు నకిలీ చానెళ్లలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకండి” అంటూ ఆమె కొంచెం ఎమోషనల్ గా, సెటైరికల్ గా చెప్పుకొచ్చింది. దీంతో కొంతమంది ‘మీకు దిష్టి ఏదైనా ఉంటే అది పోతుంది లెండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus