Chiranjeevi: వైరల్‌ అవుతోన్న చిరు ఫ్యాన్ లెటర్‌..!

కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి ఎప్పుడు వరుస సినిమాలు సైన్‌ చేయలేదు అంటుంటారు. ఒక సినిమా తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చిరంజీవిలో స్పీడ్‌ పెరిగింది. ఒకేసారి నాలుగు సినిమాలు ఓకే చేసేశారు. కొత్త కథలు వింటూనే ఉన్నారు. అయితే అభిమానుల్లో మాత్రం ఎక్కడో చిన్న వెలితి. కారణం ఆయన ఎక్కువగా రీమేక్‌లు ఎంచుకుంటుండటమే. రెండోది ఆయన స్థాయికి తగ్గ కథలు చేయకపోవడం. ముందుగా చెప్పుకున్నట్లు చిరంజీవి చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. అందులో రెండు రీమేక్‌లే. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవికి ఓ లేఖ రాశారు.

చిరంజీవి గారు…

ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలి నటన. కన్యాశుల్కంలో ఎన్ టి ఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. చంటబ్బాయి లో చిరంజీవి కనిపించడు. పాండురంగా రావు మాత్రమే ఉంటాడు. నాకు ఆ చిరంజీవి కావాలి.

ఆ రుద్రవీణ సూర్యం కావాలి. ఆ గాంగ్ లీడర్ రాజారాం కావాలి. ఈ ఖైదీ 150, సైరా, లూసిఫెర్ ఒద్దు! తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చి సార్! లూసిఫెర్ మేము ఎప్పుడో చూసేసాం. అయినా మోహన్ లాల్ మనోడే. పృథ్వీరాజ్ మనోడే! మళ్ళీ అదే కథ మీతో చూసి ఏం చేయమంటారు?

అయినా రీమేకులే తప్ప మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి “అర్థాకలి” అంటూ ఉంటారు గాని, మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో “నేను సైతం” అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదు. ఖైది #150 కి మీరెందుకు సార్? మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో. వీళ్ళు సీన్లు తీయడంలో సినిమాని మర్చి పోయారు. మీరు పస్తు ఉండండి కొన్ని రోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి. అది చూడాలనుంది. తప్పుగా భావించకండి! మీకు అద్దం చూపించాలి మరి!

ఇదీ ఆ అభిమాని రాసిన లేఖ… యథాతథంగా. ఈ మొత్తం లేఖ చదివాక మనకు సులభంగా అర్థమైపోతుంది ఆ అభిమాని ఆవేదన ఏంటో. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమాలకు తమకు వద్దని, జాతికి ఉపయోగపడే, నటన అంటే ఇదీ అని చెప్పదగ్గర సినిమాలు చేసిన చిరంజీవి మాకు కావాలి అని. అభిమానుల మాటల్ని ఎప్పుడూ వినే చిరంజీవి వరకు ఈ లేఖ చేరి, ఆయనేమన్నా సమాధానం ఇస్తారేమో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus