Rakul Preet: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ఇంట్లో మంటలు… ఆందోళన లో అభిమానులు…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్నప్రమాదం సంభవించడం కలకలం సృష్టించింది. ముంబైలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఆర్పి… అదే విధంగా ముంబై పోలీసులకి కూడా ఇన్ఫాం చేశారు.

ముంబై పోలీసులు ఈ విషయం పై కేసు నమోదు చేసి దీని పై దర్యాప్తు చేపట్టారు.తన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రకుల్ తన ఇంట్లో లేదు. అలాగే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరికీ రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక సినిమాల విషయానికి వస్టే… ఇటీవల క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన రకుల్ ప్రస్తుతం అరడజను హిందీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్ట్…ప్రస్తుతం ఆమె ప్రముఖ నటుడు అలాగే నిర్మాత అయిన జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ మధ్యనే ఈ విషయాన్ని రకుల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus