మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్లాసిక్స్ తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా వచ్చింది. ఈ సినిమాపై అభిమానులు బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. కంటెంట్ పరంగా కానీ, కలెక్షన్స్ పరంగా కానీ వారి అంచనాలకి ఈ సినిమా రీచ్ అవ్వలేదు. అలా అని బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనడానికి లేదు. ఎందుకంటే నెగిటివ్ టాక్ తో కూడా ‘గుంటూరు కారం’ రూ.110 కోట్ల వరకు షేర్ ను కొల్లగొట్టింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అయ్యింది.
అది మామూలు విషయం కాదు. మహేష్ – త్రివిక్రమ్..లకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగానే ఆ ఫీట్ సాధ్యమైంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండటంతో.. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ‘గుంటూరు కారం’ ని ఎగబడి ఎగబడి చూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఏదో ఒక విషయాన్ని తీసుకుని సోషల్ మీడియాలో డిస్కషన్లు పెడుతున్నారు.
తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన (Vennela Kishore)వెన్నెల కిషోర్ గురించి డిస్కషన్లు మొదలుపెట్టారు. విషయంలోకి వెళితే.. ‘గుంటూరు కారం’ లో వెన్నెల కిషోర్ బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు అనే పాత్రలో కనిపించాడు. హీరో పక్కనే ఉండే పాత్ర అది. విచిత్రం ఏంటంటే.. ‘అజ్ఞాతవాసి’ లో కూడా వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర పోషించాడు. అందులో కూడా అతని పాత్ర పేరు బాలసుబ్రహ్మణ్యమే కావడం విశేషం. దీంతో ‘త్రివిక్రమ్ మల్టివర్స్’ అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!