Khaidi: ‘ఖైదీ 2’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) నటించిన ‘ఖైదీ’ (Kaithi) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా బయ్యర్స్ కి మంచి లాభాలు పంచింది ఈ సినిమా. పోటీగా విజయ్ (Vijay Thalapathy) నటించిన ‘విజిల్’ (Bigil)(తమిళంలో ‘బిగిల్’) ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ చిత్రం. రిలీజ్ కి ముందు ‘ఖైదీ’ పై అంచనాలు పెద్దగా లేవు. కానీ రిలీజ్ తర్వాత దీనికి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

Khaidi

అందుకే లోకేష్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ‘విక్రమ్’ (Vikram) సినిమాలో కూడా ‘ఖైదీ’ (Khaidi) రిఫరెన్స్..లు వాడటం జరిగింది. ఇదిలా ఉండగా.. ‘ఖైదీ’ కి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు. ఇప్పటికే పలు మార్లు ‘ఖైదీ 2’ పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కానీ కార్తీ ఈ సీక్వెల్ కి రెడీగా లేడు అనే కంప్లైంట్ ఉంది. ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) ప్రమోషన్స్ లో ‘సర్దార్ 2’ (Sardar) పూర్తయ్యాక ‘ఖైదీ 2’ చేయబోతున్నట్టు కార్తీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. రజినీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ (Coolie) తెరకెక్కిస్తున్నాడు.

అది పూర్తయిన వెంటనే ‘ఖైదీ 2’ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఒకసారి షూటింగ్ మొదలుపెడితే చక చక చిత్రీకరణ జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లోకేష్ భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి టైటిల్ ‘ఖైదీ 2’ ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కాదు. ఈ సినిమా కథ ఢిల్లీ… ఖైదీగా మారకముందు మొదలవుతుందట.

అందుకోసం ‘ఢిల్లీ’ అనే టైటిల్ పెట్టి క్యాప్షన్ గా ‘ఖైదీ 2’ అని పెట్టబోతున్నారని సమాచారం. జైలుకు వెళ్లడానికి ముందు ఢిల్లీ ఏం చేశాడు? ఏ క్రైమ్ లో ఇరుక్కుని జైలుకి వెళ్ళాడు? అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తుంది.

విజయ్ సభలో ఫ్యాన్స్ దారుణమైన చేష్టలు.. ఊహించని నష్టం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus