దివ్య- అర్నవ్‌ ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్..!

  • October 18, 2022 / 12:39 AM IST

కోలీవుడ్ బుల్లితెర ఆర్టిస్ట్ లు దివ్య, అర్నవ్‌ లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరి వ్యవహారం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ అర్నవ్‌ తక్కువ వాడేమీ కాదు అని ప్రూవ్ అవుతుంది. దివ్య కంటే ముందే అర్నవ్ కు పెళ్లైందట. అది కూడా ఓ ట్రాన్స్‌జెండర్‌ను అతను పెళ్లాడాడని సమాచారం. అంతేకాదు ఆమెను కూడా వదిలేసాడట. ఆమె పేరు ప్రియదర్శిని. ఈ ట్రాన్స్‌జెండర్‌ కి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

ఇందులో ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘‘ నాకు, అర్నవ్‌కు టీ నగర్‌లో పరిచయం అయ్యింది. తర్వాత అది ప్రేమగా మారింది. 10 ఏళ్ల క్రితమే ఓ గుడిలో మేము పెళ్లి చేసుకున్నాం.కొన్నాళ్ళు నాతో అతను బాగానే కలిసున్నాడు. కానీ తర్వాత నన్ను వేధించడం మొదలుపెట్టాడు.అదే టైంలో అతను వేరే మహిళలతో క్లోజ్‌గా ఉండేవాడు అన్న విషయం నాకు మొదట తెలీలేదు.కారణం లేకుండా నన్ను రోజూ కొట్టేవాడు. 8 ఏళ్ళు అతని భరించాను. తర్వాత నా అదృష్టం బాగుంది అతనితో విడిపోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

అర్నవ్‌, దివ్యలు మొదట 2017లో కలుసుకున్నారు. ‘కేలాడి కన్మణి’ సీరియల్‌ షూటింగ్‌ టైంలో వీరికి పరిచయం ఏర్పడింది.అప్పటికే దివ్యకు ఓ పాప ఉంది.ఆమె విడాకులు తీసుకుని భర్తతో వేరుగా జీవిస్తోంది. ఈ క్రమంలో అర్నవ్‌ ఈమెను ట్రాప్ చేశాడు. ఎంతో ఫ్రెండ్ షిప్ ఏర్పరుచుకుని ప్రేమ అంటూ దగ్గరయ్యి పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరూ కలిసి ఓ ఫ్లాట్‌ కూడా తీసుకున్నారు. 2022, జూన్‌ 29న హిందూ సాంప్రదాయ పద్దతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత దివ్య గర్భవతి కావడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇదే టైంలో అన్షిత మరో సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడ్డాడు అర్నవ్. ఈ నేపథ్యంలో అర్నవ్ తో పాటు అన్షిత కూడా కలిసి దివ్యని వేధించడం మొదలుపెట్టింది. చివరికి వీరి ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుందో చూడాలి..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus