ఒక భాషలో సక్సెస్ అయిన చిత్రాన్ని వేరే భాషల్లో రీమేక్ చేసి హిట్ కొట్టాలి అనుకోవడం సేఫ్ గేమ్ అనుకుంటే చాలా పొరపాటు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాము. ఇందుకు ఉదాహరణలు కూడా వందలకొద్దీ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ మేకర్స్ ఇంకా గ్రహించడం లేదని స్పష్టమవుతుంది. బాలీవుడ్ మేకర్స్ పై సౌత్ మేకర్స్ కు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ ఓ సినిమాని అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్ లో ఫినిష్ చేస్తారు అని..!
కానీ రీమేక్ (Remake) లను తెరకెక్కించడంలో మాత్రం బాలీవుడ్ మేకర్స్ సరైన శ్రద్ద పెట్టడం లేదు. ఒరిజినల్ ను పూర్తిగా చెడగొట్టడంలో బాలీవుడ్ ముందుంటుంది అనే విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నారు అక్కడి మేకర్స్. ‘సెల్ఫీ’ మూవీతో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్, ఇమ్రాన్ హష్మి, డయానా పెంటి, నుస్రత్ బరూచ్చా కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం … మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ కు రీమేక్.
ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాని రూ.110 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే … బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లు కూడా రాబట్టలేదు అని ట్రేడ్ పండితుల సమాచారం. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇక్కడ కూడా ఘోరమైన పెర్ఫార్మన్స్ ఇస్తుంది. దీంతో డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ లభో దిబో అంటున్నట్టు వినికిడి.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?