‘కాంతార’.. గతకొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది..యావత్ సినీ ప్రపంచం తలతిప్పి కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన సినిమా.. ఇది మా కన్నడ సినిమా అని కన్నడిగులంతా కాలర్ ఎగరేస్తున్న సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు పుట్టించడమే కాక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రిషబ్ శెట్టి క్రియేషన్ ‘కాంతార’. ‘కె.జి.యఫ్‘ తర్వాత కన్నడ పరిశ్రమ పేరు ప్రపంచమంతా బీభత్సంగా వినిపిస్తున్న ‘కాంతార’ గురించి..
యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి, సినిమాలో ఆయన చూపించిన కర్ణాటక సాంప్రదాయ కళ, కళాకారుల గురించిన వార్తలు గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు తమ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ ఆదరణ పొందిన చిత్రమిదేనని హోంబలే ఫిల్మ్స్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ‘కాంతార’ మూవీ థియేటర్లో ఓవ్యక్తి మరణించాడన్న వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి..
వివరాళ్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్య జిల్లా, నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్లో ‘కాంతార’ సినిమా ఆడుతుంది. రాజ శేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఛాతీ నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడు నాగమంగళలోని సరిమేగలకొప్ప నివాసి.. పండుగ రోజు ’కాంతార’ సినిమాకి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి ఆనందంగా బయలుదేరిన రాజ శేఖర్ మూవీ చూసి బయటకొస్తుండగా.. ఉన్నట్టుండి కింద పడిపోయాడు.. చుట్టుపక్కల వారు ముందుగా ఫిట్స్ వచ్చాయోమోననుకుని, తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్దామని చూడగా రాజ శేఖర్ అప్పటికే మరణించాడు.
దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోస్టల్ కర్ణాటకలోని సంప్రదాయ దైవనర్తకులకు ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతరించిపోతున్న ప్రాచీన కళలను, వాటిని పెంచిపోషిస్తున్న కళాకారులకు సాయమందించాలని నిర్ణయించుకుంది. అరవై సంవత్సరాలు పైబడిన దైవ నర్తకులకు.. వారి ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడం జరిగింది..