ప్లాప్ డైరెక్టరుతో చేయబోయే సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ అవసరమా..?

‘అఆ’ చిత్రం తర్వాత మళ్ళీ హిట్టందుకోలేదు నితిన్. కొత్తగా ట్రై చేయాలని చేసిన ‘లై’ చిత్రం కాస్ట్లీ ప్రయోగంగా మిగిలిపోయింది. ఇక పవన్, త్రివిక్రమ్ సాయంతో చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఛల్ మోహన్ రంగ’ కూడా ఉత్తర్ ప్లాప్ అయ్యింది. ఇక ఎన్నో ఆశలతో దిల్ రాజు నిర్మాణంలో చేసిన ఫ్యామిలీ చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’ కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో ఈసారి ఆచి తూచి కథల్ని ఎంచుకుంటున్నాడు నితిన్. కొంచెం గ్యాప్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇందులో భాగంగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్షన్లో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. దీంతో పాటూ మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడట.

తనతో ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ చైతన్య తో మరోసారి పనిచేయబోతున్నాడట. ‘ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి’ అన్నట్టుగా తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్ళీ హిట్టందుకోవాలని భావిస్తున్నట్టున్నాడు నితిన్. ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను కూడా ఖరారు చేశారట. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పవర్ పేట’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నితిన్ సొంత ప్రొడక్షన్ అయిన ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్లో ఈ చిత్రం నిర్మితమవ్వనుందట. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus