Nidhhi Agerwal: నిధి అగర్వాలా మజాకా.. హ్యాట్రిక్ కొట్టేసిందిగా..!

అవును టాలీవుడ్లో ఏ హీరోయిన్ కు లేని రికార్డుని నిధి అగర్వాల్ సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మన టాలీవుడ్ సినిమాలకు హిందీలో కూడా మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ను (డిజిటల్ +శాటిలైట్ కలిపి) కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అక్కడి మేకర్స్. రామ్,నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలకు అక్కడ మంచి గిరాకీ ఉంది.

వాళ్ల ప్రతీ సినిమా హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల పైనే వ్యూస్ నమోదవుతుండటం విశేషం. అయితే హీరోయిన్లలో మాత్రం ప్రస్తుతానికి నిధి అగర్వాల్ నెంబర్ 1 ప్లేస్ ను కొట్టేసింది. సౌత్ లో మరే హీరోయిన్‌ కు లేని విధంగా ఆమెకు యూట్యూబ్‌లో 100 ప్లస్ మిలియన్ల వ్యూస్ సినిమాలు ఉన్నాయి. ఆమె హీరో నాగ చైతన్యతో చేసిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా ఇక్కడ ప్లాప్ అయినప్పటికీ హిందీ వెర్షన్ కు 130 మిలియన్ ప్లస్ వ్యూస్ నమోదయ్యాయి. ఇక ఈమె రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఇక్కడ డిజాస్టరే. అయితే హిందీ వెర్షన్ కు 200 మిలియన్ ప్లస్ వ్యూస్ నమోదయ్యాయి. ఇక నిధికి తొలి హిట్ ను అందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి కూడా 202 మిలియన్ పైనే వ్యూస్ నమోదయ్యాయి. దీంతో ‘నిధి అగర్వాలా మజాకా’ అంటూ ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంతో పాటు మహేష్ బాబు మేనల్లుడు హీరోగా నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus