Allu Arjun: పుష్ప ఖాతాలో చేరిన అరుదైన రికార్డులివే!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించిందని చెప్పవచ్చు. ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అధిక మొత్తంలో కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయినప్పటికీ ప్రతి ఒక్క భాషలోనూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో ఈ సినిమా ఏకంగా 25 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించగా హిందీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా ఈ సినిమా కలెక్షన్లను కురిపిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 96 కోట్లను రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రేంజ్ ను అమాంతం పెంచేసింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీవల్లి పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా హిందీలో ఏమాత్రం ప్రమోషన్ లేకుండా ఈ విధమైనటువంటి కలెక్షన్లను రాబట్టడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ కు భారీ మార్కెట్ ఏర్పడింది. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా పుష్ప సినిమా రికార్డులు సృష్టించింది.

ఇక హిందీలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాగా 2 మిలియన్ లైక్స్ సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ఇక తాజాగా 24 గంటలలో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా శ్రీవల్లి హిందీ సాంగ్ రికార్డులు సృష్టించడం గమనార్హం. ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఈ రికార్డులను సృష్టించడంతో ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus