Jr NTR, Ram Charan: తారక్ చరణ్ ఫ్యాన్స్ ప్లాన్ భలే ఉందిగా?

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెరిగింది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కొంతమంది భావిస్తుంటే మరి కొందరు ఎన్టీఆర్ కు ఇచ్చారని భావిస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

మెగా, నందమూరి హీరోల కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, చరణ్ లను కలుపుతూ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ 10,000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి గొడవలు జరగకుండా ఫ్యాన్స్ జాగ్రత్త పడుతున్నారు. థియేటర్లను కేటాయించుకుని ఒక హీరో ఫ్యాన్స్ మరో థియేటర్ దగ్గర హడావిడి చేయకుండా ఫ్యాన్స్ జాగ్రత్త పడుతున్నారు.

ఇందుకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు టికెట్ల అమ్మకాల బాధ్యతలను తీసుకోనున్నాయని తెలుస్తోంది. అభిమాన సంఘాల అధ్యక్షులే ఏ గొడవ జరిగినా బాధ్యత వహించనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ సినిమాల మార్కెట్ రేంజ్ ను కూడా పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆ అంచనాలను మించి విజయం సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

రాజమౌళి సినిమా సక్సెస్ సాధించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా సక్సెస్ తో రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ను మరింత పెంచడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు ఆర్ఆర్ఆర్ లో పుష్కలంగా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పేశారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus