Ravi Teja: ఆ విషయంలో రాజమౌళిని రాళ్లతో కొట్టిన కూలీలు..అసలు ఏమి జరిగిదంటే!

దర్శక చక్రవర్తి రాజమౌళి కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినప్పటికీ ఆడియన్స్ దృష్టిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం ‘విక్రమార్కుడు’. రాజమౌళి కి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అని అనేక సందర్భాలలో తెలిపాడు. అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన రవితేజ,ఈ చిత్రం ద్వారా మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషించాడు. కానీ రవితేజ సినిమా అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే.

అందుకే ఫస్ట్ హాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు క్యారక్టర్ ద్వారా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని వాడుకొని, సెకండ్ హాఫ్ తన మార్క్ పవర్ ఫుల్ హీరోయిజం ని పెట్టాడు రాజమౌళి. రెస్పాన్స్ అదిరిపోయింది, రవితేజ ఇమేజి ఒక్కసారిగా పదింతలు అయ్యింది. అప్పట్లో 11 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.

ఈ చిత్రాన్ని కేవలం 90 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేసారు. కొన్ని సన్నివేశాలు కర్ణాటకలోని క్వారీలలో షూట్ చేసారు. అయితే ఆ క్వారీలలో షూటింగ్ చేసే సమయం లో అక్కడి కూలీలకు పనులు ఆగిపోయాయి. ఆ రోజు కూలి డబ్బులు క్వారీ యాజమాన్యం కూలీలకు ఇవ్వలేదు. దీనితో వెర్రెక్కిపోయిన కూలీలు మూవీ యూనిట్ పై రాళ్లు రువ్వారు.

రాజమౌళి తో పాటుగా, అందరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇకపోతే తొలుత ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీద్దాం అని అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ సినిమా చేయలేకపోయారు. ఆయన బదులు రవితేజ (Ravi Teja) చేసి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus