ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. దీపికా పదుకొనె తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం నుండి గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి టైటిల్ ‘కల్కి 2898 -AD’ అని ఫిక్స్ చేశారు.
భవిష్యత్తులో సంభవించబోయే యుగాంతానికి సంబంధించిన కథ ఇది అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ కలిగిన ఓ హీరో జనాలను ఎలా కాపాడాడు అనేది థీమ్ అని స్పష్టమవుతుంది. అయితే ఈ చిత్రంలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. పురాణాల్లో చావే లేని వాళ్ళుగా ఆంజనేయుడు, అశ్వద్ధామ ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది నమ్మకం.
ఆంజనేయుడు ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అనుకునే వాళ్ళు ఉన్నారు. అశ్వద్ధామ కూడా బ్రతికే ఉన్నాడు అనేది ఇంకొంతమంది నమ్మకం. ఒకవేళ అశ్వద్ధామ బ్రతికుంటే ఎలా ఉంటుంది..? అనే థీమ్ తో ఈ చిత్రంలో అమితాబ్ పాత్రని డిజైన్ చేసినట్లు ఎప్పటి నుండో టాక్ నడుస్తుంది. అయితే మైథాలజీ కథాంశాలతో సినిమాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘ఆదిపురుష్’ విషయంలో దర్శకుడు ఓం చాలా తప్పులు చేశాడు.
రామాయణాన్ని అతనికి నచ్చినట్టు , పేరడీ చేసినట్లు తీశాడు. అందుకే మొదటి వీకెండ్ తర్వాత ఆ మూవీ కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా నార్త్ లో ఆ మూవీ కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడింది అంటే.. దానికి కారణం అదే అని చెప్పాలి. ‘ప్రాజెక్టు కె’ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ అలాంటి తప్పే చేస్తే కనుక అతను కూడా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు