Jr NTR: వార్2 సినిమాలో తారక్ ఎంపిక వెనుక ఇంత జరిగిందా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్2 సినిమా గురించి తెగ చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. అయితే వార్2 సినిమాలో మొదట ప్రభాస్ కు ఛాన్స్ దక్కిందని ప్రభాస్ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పారని తెలుస్తోంది. వార్ సిరీస్ కు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పారని తెలుస్తోంది. అయితే వార్2 మూవీ కథ అద్భుతంగా ఉండటంతో తారక్ మాత్రం ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే మాత్రం వార్2 రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

వార్2 సినిమాలో తారక్ నటించడం కన్ఫామ్ అయినా తారక్ (Jr NTR) రోల్ గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. తారక్ ఈ సినిమాలో పాజిటివ్ రోల్ లో కనిపిస్తారో లేక నెగిటివ్ రోల్ లో కనిపిస్తారో క్లారిటీ రావడం లేదు. తారక్ రెమ్యునరేషన్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ ఇతర హీరోలకు భిన్నంగా మల్టీస్టారర్లకు సైతం సై అంటున్నారు.

అయితే తారక్ గత ఆరు సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వార్2 సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నచ్చేలా ఉండనుందని సమాచారం అందుతోంది. వార్2 సినిమా బడ్జెట్ కు సంబంధించి ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. వార్2 సినిమాకు సంబంధించి త్వరలో షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని బోగట్టా.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus