Jr NTR,Chiranjeevi: ఎన్టీఆర్ సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు మూవీ.. 22 ఏళ్ళ క్రితం అలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో గ్లోబల్ హీరోగా ఎదిగాడు. విదేశాల్లో కూడా అతనికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే పక్క దేశాల్లో కూడా రిలీజ్ కావాల్సి ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు కొరటాల శివ అండ్ టీం. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కెరీర్లో చాలా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

అందులో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్ కు మొదటి సక్సెస్ ను అందించింది ఈ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం జరిగింది. 2001 సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తికావస్తోంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. యం.యం.కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.

42 కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డు కొట్టింది ఈ మూవీ. అయితే ఈ సినిమా పక్కన రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ సినిమా మాత్రం నిలబడలేకపోయింది. మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఎన్టీఆర్ (Jr NTR,Chiranjeevi) ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ మూవీ దూసుకుపోవడంతో ‘డాడీ’ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus