స్టేజి పై యాంకర్ మెడలో పూల దండ వేసి.. నటుడి వింత ప్రవర్తన పై ట్రోలింగ్..!

సినిమా వాళ్ళు స్టేజి పైకి వెళ్లారు అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించడానికి చాలా హోమ్ వర్క్ చేస్తారు. ఎలా నిలబడాలి.. ఎలా మాట్లాడాలి.. ఎంత అటెన్షన్ తో ఉండాలి అనేది ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తారు. అయితే కొంతమంది నటీనటులు మాత్రం అదే టైం అన్నట్టు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు.. అవతలి నటీనటుల పై యాంకర్లపై సెటైర్లు వేస్తారు. లేదంటే తమకి ఎవరి పై అయితే కోపంగా ఉందో వాళ్ళ పై వ్యంగ్యాస్త్రాలు వదులుతారు.

ఇంకొంతమంది నటీనటులు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి యాంకర్లతో కూడా వరస్ట్ గా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ నటుడు కూల్ సురేష్ వివాదంలో చిక్కుకున్నాడు.అతనికి వివాదాలు కూడా కొత్తేమీ కాదు అని అంతా అంటుంటారు. తాజాగా ‘సరక్కు’ అనే సినిమా మ్యూజిక్ లాంచ్ వేడుకలో అతను పాల్గొన్నాడు. ఆ సమయంలో అతను స్పీచ్ ఇస్తూ ఉండగా.. ఏమైందో ఏమో.. పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలదండ వేశాడు.

దీంతో ఆ యాంకర్ షాక్ అయ్యింది. తర్వాత చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది. అటు తర్వాత ఆ యాంకర్ చిరాకుగా ఆ పూల దండాన్ని తీసేసి పక్కన పడేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు కూల్ సురేష్ (Suresh) ను తిట్టిపోస్తున్నారు. సింగర్ చిన్మయి కూడా అతని పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus