Kodi Ramakrishna, Balayya Babu: కోడి రామకృష్ణ-బాలయ్య కాంబినేషన్లో సినిమా.. ఇప్పటికీ పెద్ద మిస్టరీనే!

తెలుగు తెరపై ఎన్నో హిట్ కాంబినేషన్లు వున్నాయి. డైరెక్టర్లు హీరో, హీరో హీరోయిన్లు, హీరోలు సంగీత దర్శకులు ఇలా ఎన్నో జంటలుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బఇందులో కోడి రామకృష్ణ- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒకటి. ప్రస్తుతం బాలయ్య- బోయపాటి జోడికి ఎంతటి పేరు వచ్చిందో అప్పట్లో బాలయ్య – కోడి రామకృష్ణకు జోడీకి అంతకుమించిన క్రేజ్ వుండేది. భారీ బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ కాంబినేషన్ ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో పరిశ్రమతో పాటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు.

మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య వంటి సూపర్ హిట్ సినిమాలను చేసిన బాలయ్య- కోడి రామకృష్ణ జోడీకి నిర్మాతగా భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి కూడా బాగా కలిసి వచ్చారు. ఇలాంటి హిట్ కాంబినేషన్ లో ఓ జానపద సినిమాను మొదలుపెట్టారు. భారీ స్టార్ క్యాస్టింగ్ తో, సగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ కారణాలు తెలియదు కానీ.. ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమాను పక్కనబెడితే..

మళ్లీ బాలయ్యతో కోడి రామకృష్ణ ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయకపోవడం అనేక అనుమానాలను కలిగించింది. దీనికి రకరకాల కథనాలు అప్పట్లో మీడియాలో హల్ చల్ చేశాయి. బాలయ్యకు , కోడి రామకృష్ణకు గ్యాప్ వచ్చిందని అందుకే సినిమా ఆగిపోయిందని గిట్టని వారు నానా రకాలుగా ప్రచారం చేశారు. అయితే బతికున్న రోజుల్లో ఈ ప్రశ్నకు కోడి రామకృష్ణ సమాధానమిచ్చి ఊహాగానాలకు చెక్ పెట్టారు.. గోపాల్ రెడ్డికి బాలయ్య విపరీతమైన అభిమానమని..

మంగమ్మగారి మనవడు తర్వాత బాలకృష్ణ స్టార్ అయిపోయాడని, దీనికి అనుగుణంగానే బాలయ్య అడక్కుండానే ప్రతి సినిమాకు గోపాల్ రెడ్డి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వచ్చారని కోడి రామకృష్ణ తెలిపారు. ముద్దుల మావయ్య తర్వాత బాలకృష్ణకు దరిదాపుల్లోకి వచ్చే స్టార్ ఎవరూ లేకపోవడంతో దాదాపు ఆయన అగ్రహీరోగా మారిపోయారని.. అదే సమయంలో ఆయన పారితోషికం కూడా పెరిగింది. ఆ సమయంలో బాలయ్యతో సినిమా తీస్తే మన మీద అభిమానంతో ఆయన పారితోషికం తీసుకోవాలని..

అలాంటి పరిస్థితి మన వల్ల బాలకృష్ణకు రాకూదని, ఆర్ధిక పరిస్ధితి బాగున్నప్పుడు సినిమా తీద్దామని గోపాల్ రెడ్డి తనతో చెప్పారని కోడి రామకృష్ణ వెల్లడించారు. అటు మధ్యలో ఆగిపోయిన సినిమా గురించి చెబుతూ… అది దాదాపు 27 శాతం పూర్తయ్యిందని, ఒకవేళ గోపాల్ రెడ్డి బతికుంటే పూర్తి చేసేవాళ్లమని రామకృష్ణ పేర్కొన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus