శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది శ్వేతా బసు ప్రసాద్. ఇంటర్ మీడియట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్వేతా బసు నటనకు మంచి మార్కులు పడ్డాయి. గోదావరి జిల్లా కు చెందిన అమ్మాయిగా అందులోనూ పక్కింటి తెలుగమ్మాయిగా మాదిరి కనిపించి కుర్రకారుని కూడా ఆకట్టుకుంది. తరువాత ‘రైడ్’ ‘కాస్కో’ ‘కలవర్ కింగ్’ వంటి చిత్రాల్లో నటించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.
తరువాత ఆఫర్లు కూడా రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇదిలా ఉండగా.. 2018 లో రోహిత్ మిట్టల్ అనే వర్ధమాన దర్శకుడిని వివాహం చేసుకున్న శ్వేతా.. సంవత్సరం లోపే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు కథనాలు వినిపించాయి. అయితే విడాకుల తర్వాత ఈమె డిప్రెషన్ కు వెళ్ళిపోయినట్టు కూడా తన సోషల్ మీడియాలో చెప్పి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఓ మానసిక వైద్యుడు దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్వేత ను చూసి..
ఆమె తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారట. దాంతో వారు ఈమెను మరో వివాహం చేసుకోవాలి అని కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో లాక్ డౌన్ పూర్తయ్యాక సీక్రెట్ గా వివాహం చేసుకోవాలి అని శ్వేతా బసు ప్రసాద్ భావిస్తుందని సమాచారం.