‘పుష్ప 2’ (Pushpa 2) ప్రాజెక్టు గురించి మొదటి నుండి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి. ‘పుష్ప’ (Pushpa) ప్రాజెక్టు మొదలయ్యే ముందే బన్నీ.. కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించాడనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా జరిగింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) విషయంలో. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా మ్యూజిక్ వల్ల వెనకబడింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమా పోటీలో నిలబడడానికి తమన్ (S.S.Thaman), మ్యూజిక్ ప్లస్ అయ్యింది. అల్లు అర్జున్ (Allu Arjun) నమ్మకం అదే.
అందుకే ‘పుష్ప’ ప్రాజెక్టు మొదలవ్వడానికి ముందే దేవీని తప్పించి తమన్ ని పెట్టుకుందాం అని దర్శకుడు సుకుమార్ తో బన్నీ చెప్పడం జరిగింది అనే టాక్ టీం నుండి ఎక్కువగా వినిపించింది. అయితే సుకుమార్ కన్విన్స్ చేసి దేవీనే పెట్టుకున్నాడు. అప్పటికీ బన్నీ కన్విన్స్ కాలేదు. ఆ టైంలో మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి మూడు పాటలు ఫైనల్ చేయడం.. అవి బన్నీకి నచ్చడంతో దేవీనే ఉంచారు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ రిలీజ్ టైం తక్కువ ఉండటంతో దేవీని ఎక్కువగా కార్నర్ చేయలేదు. ఇక ‘పుష్ప 2’ మొదలయ్యాక.. మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాక కూడా బన్నీ… దేవీపై సుక్కు వద్ద కంప్లైంట్ చేయడం జరిగిందట. అయినా సుకుమార్ వెనకేసుకొచ్చాడు.
అయితే రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్నప్పుడు దేవీ కన్సర్ట్,,లు చేయడం వల్ల దొరికిపోయాడు అని తెలుస్తుంది.గతంలో సుకుమార్ (Sukumar) సినిమాలకి.. రిలీజ్ కి 4 రోజులు టైం మాత్రమే ఉన్నా.. బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. ఏదేమైనా ‘పుష్ప 2’ విషయంలో ఫైనల్ గా బన్నీ మాటే గెలిచింది అనుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ సి ఎస్ (Sam C. S.), తమన్, అజనీష్ (B. Ajaneesh Loknath)..లతో కొట్టిస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో..!