సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఎవరొకరు అనారోగ్య సమస్యలతో లేదా వయసు సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉండే సినీ సెలబ్రిటీలు సైతం మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కడి బుల్లితెర పై సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న శృతి షణ్ముగప్రియ భర్త కన్నుమూశారు.
గతేడాది వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లైన ఏడాదికే తన భర్తను కోల్పోయింది శృతి షణ్ముగప్రియ. అతను వెయిట్ లాస్ ట్రైనర్ అలాగే బాడీ బిల్డర్ కూడా..! కొన్నాళ్ళు డేటింగ్ చేసి వీరు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వీరి బ్యూటిఫుల్ మూమెంట్స్ ను శృతి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈయన తాజాగా గుండెపోటుతో మరణించారు. ఆగస్టు 2న అరవింద్ కి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తరలించినా అప్పటికే అతను కన్నుమూసినట్టు సమాచారం. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అరవింద్ మరణానికి చింతిస్తూ శృతి షణ్ముగప్రియ కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నారు. తన (Shruthi Priya) భర్త మరణ వార్త పై శృతి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.