Chiranjeevi: వద్దు వద్దు అన్న కాంబినేషన్లు సెట్ చేసి ప్లాపులు పడేలా చేసిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి గారి జడ్జిమెంట్ కు ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంటుంది. ఆయన ఊరికే ఓ కథని ఓకె చేయరు.. ఊరికే ఓ కథకి నో చెప్పరు అని అప్పట్లో అంతా అనుకునే వారు. 99 శాతం ఇది నిజమయ్యేది కూడా..! కానీ కొంచెం ట్రెండ్ మారిన తర్వాత ఆయన జడ్జిమెంట్ కు తగినట్లు ఫలితాలు దక్కడం లేదు. ఉదాహరణకి చిరు విషయంలో 3 సందర్భాలు చెప్పుకోవచ్చు.

1) ‘జై చిరంజీవ’ సినిమా టైంకి త్రివిక్రమ్.. కె.విజయ్ భాస్కర్ గారి దగ్గర పనిచేయడం మానేసాడు. అప్పటికి వాళ్ళ మధ్య ఏం గ్యాప్ వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. ఆ సినిమా టైంకి త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ ‘అతడు’ సినిమాలకి దర్శకత్వం వహించి రెండు హిట్లు కూడా కొట్టాడు. కానీ చిరు కావాలని త్రివిక్రమ్ ను ‘జై చిరంజీవ’ ప్రాజెక్టులో ఇరికించారు. అయిష్టంగానే ఆ సినిమాకి పనిచేశాడు త్రివిక్రమ్. అందుకే ఆ సినిమాలో కామెడీ క్లిక్ అయ్యింది కానీ కథ క్లిక్ అవ్వలేదు. ఫలితం ప్లాప్.

2) అలాగే చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రానికి కూడా అదే విధంగా చేశాడు. ఈ చిత్రం టైంకి శ్రీను వైట్ల దగ్గర పనిచేసే గోపి మోహన్, కోన వెంకట్ లు సెపరేట్ అయిపోయారు. కానీ ‘బ్రూస్ లీ’ కోసమని మళ్ళీ శ్రీను వైట్ల వద్ద రైటర్స్ గా చేశారు. కట్ చేస్తే ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇక్కడ కూడా చిరు బలవంతం వల్లనే కోన వెంకట్, గోపి మోహన్ లు పనిచేసారు.

3) ఇటీవల వచ్చిన ‘ఆచార్య’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొరటాల శివకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి. కానీ మణిశర్మని తీసుకొచ్చి తగిలించాడు చిరు.మణిశర్మ తో కొరటాల శివకి పడలేదు. చివరికి మణిశర్మ కొడుకు మహతి వచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడు. అదీ అతికీఅతకనట్టు అయ్యింది. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా చిరు వేలు పెట్టడం ఎక్కువైంది. అందుకే దీని ఫలితం కూడా తేడా కొట్టింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus