‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇందులో భాగంగా వచ్చిన మొదటి సినిమా ‘హిట్'(హిట్ ఫస్ట్ కేస్) హిట్ అయ్యింది. అందులో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత ‘హిట్ 2′(ది సెకండ్ కేస్) (HIT 2) వచ్చింది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘హిట్ 3’ (HIT3) కూడా రూపొందుతోంది. ఇందులో నాని (Nani) హీరోగా నటిస్తున్నాడు. దీంతో దీనిపై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.
నాని,ప్రశాంతి తిపిర్నేని..లు నే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే 1న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. అదేంటంటే.. ఈ కథలో భాగంగా జరిగే ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో .. నానితో పాటు మొదటి రెండు పార్టుల్లో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్..లు కూడా నటించాల్సి ఉందట. అందుకు అడివి శేష్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్లో అడివి శేష్ పాల్గొంటున్నాడు అని సమాచారం.
అయితే విశ్వక్ సేన్ మాత్రం ‘హిట్ 3’ భాగం కావడానికి సముఖంగా లేడు అని తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక సీన్లో భాగంగా నాని ఒక చైర్లో కూర్చుంటే వెనుక అడివి శేష్, విశ్వక్ సేన్.. నిలబడాల్సి ఉందట. ఆ సీన్లో నటించడం విశ్వక్ సేన్ కి ఇష్టం లేదు అని తెలుస్తుంది. దీంతో కొంచెం టైం కావాలి అంటూ అతను ఆలస్యం చేస్తున్నట్టు వినికిడి. అయితే ‘హిట్ 3’ క్లైమాక్స్ లో ఇద్దరి హీరోల ప్రెజన్స్ కచ్చితంగా ఉండాలట.