సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి.. దర్శక నిర్మాతలు కావాలనే బిజినెస్ గురించి చేస్తారో.. లేదా కామెడీగా చేస్తారో లేదో తెలియదు కానీ భలే గమ్మత్తైన సంఘటనలు సంచలనాలకు నాంది అవుతుంటాయి.. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది సర్వ సాధారణమే.. ప్రాంతానికి తగ్గట్టు కథలో సోల్ మిస్ కాకుండా చిన్న చిన్న మార్పులతో రీమేక్ చేయగా సూపర్ హిట్స్ అయిన శాతమే ఎక్కువ..
అలా కాకుండా.. ఓ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేసి.. తర్వాత హిందీలో తెరకెక్కించి.. తెలుగు స్టార్ క్యామియో రోల్ చేసిన ఆ హిందీ సినిమాని మళ్లీ తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుంది?.. చదువుతుంటేనే చిత్రంగా అనిపిస్తోంది కదూ.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1994లో తమిళనాట భాగ్యరాజా హీరోగా నటిస్తూ.. ‘వీట్ల విశేశాంగ’ అనే సినిమా డైరెక్ట్ చేశారు.. ప్రగతి (పాపులర్ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్) కథానాయికగా నటించారు..
ఈ సినిమాని తెలుగులో ‘గౌరమ్మ నీ మొగుడెవరమ్మా’ పేరుతో డబ్ చేశారు.. తమిళనాడు మాదిరిగానే ఇక్కడ కూడా ప్రేక్షకాదరణ పొందింది.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. తర్వాత 1996లో హిందీలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా.. భాగ్యరాజా దర్శకత్వంలోనే ‘మిస్టర్ బేచారా’ పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అక్కినేని నాగార్జున అతిథి పాత్రలో కనిపించారు.. అప్పటికే ‘శివ’, ‘ఖుదాగవా’, ‘ద్రోహి’, ‘క్రిమినల్’, ‘అగ్నివర్ష’ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున..హీరా, అనుపమ్ ఖేర్, శక్తి కపూర్ వంటి భారీ తారాగణంతో హిందీ నేటివిటీకి తగ్గట్టు మార్చి తెరకెక్కించారు..
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తండ్రి.. సుప్రసిద్ధ దర్శకులు కె.ఎస్.ప్రకాశ రావు ఈ ‘మిస్టర్ బేచారా’కి సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.. నాగార్జున ప్రత్యేకపాత్రలో కనిపించాడంటూ ఈ సినిమాని మళ్లీ తెలుగులో ‘అజయ్’ పేరుతో డబ్ చేశారు. మరో హైలెట్ ఏంటంటే ‘మిస్టర్ బేచారా’లో నాగ్ క్యారెక్టర్ పేరు కూడా అజయ్ కావడం.. ఇలా.. తమిళ్ నుండి తెలుగు డబ్బింగ్.. తమిళ్ నుండి హిందీ రీమేక్.. తెలుగు స్టార్ అతిథి పాత్ర చేస్తే మళ్లీ తెలుగులో డబ్ చేయడం ఈ సినిమా విషయంలో విచిత్రంగా జరిగింది..
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!