అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి విషయం బయటకు రాలేదంట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన సినిమా ‘నిన్ను చూడాలని’.. సెకండ్ సినిమా ‘స్టూడెంట్ నెం.1’ తర్వాత ‘సుబ్బు’ అనే చిత్రం చేశాడు. సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ మణిశర్మ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంటాయి.. ముఖ్యంగా ‘మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ’ అనే పాట బాగా పాపులర్ అయింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కోసమని కంపోజ్ చేసిన ఈ పాటను మణిశర్మ తారక్‌కి ఇచ్చేశాడంటూ వార్తలు వచ్చాయి కూడా..

‘స్టూడెంట్ నెం.1’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ‘సుబ్బు’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కట్ చేస్తే రిలీజ్ తర్వాత రిజల్ట్ తేడా కొట్టింది.. కానీ షూటింగ్ దశలో ఉండగానే ఓ కాంట్రవర్సీ కారణంగా ఈ మూవీకి మంచి ప్రమోషన్ వచ్చేసింది.. అది కూడా హీరోయిన్ సోనాలీ జోషి వల్లే.. ఈ మూవీ డైరెక్టర్ రుద్రరాజు సురేష్ వర్మ మీద అమ్మడు చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి..

సాంగ్స్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది యూనిట్.. ఓరోజు రాత్రి దర్శకుడు సురేష్ వర్మ ఫుల్‌గా మందుకొట్టి, తన రూం డోర్ కొట్టి.. లోపలికి వచ్చి కోరిక తీర్చమని బలవంతం చేశాడని.. తాను తిరస్కరించడంతో తర్వాతి రోజు షూటింగులో చిత్రహింసలు పెట్టాడని కాామెంట్స్ చేయడం టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చలకు దాారితీసింది. ‘ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్.. లేదంటే ఇక ఇండస్ట్రీలో కనిపించవ్’ అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దల నుండి సోనాలీకి వార్నింగ్స్ వెళ్లాయట.

‘నీకిది ఫస్ట్ సినిమా..చెప్పినట్టు వింటే నీకే మంచిది.. లేదంటే లగేజ్ సర్దేసుకుంటావ్’ అని కాస్త గట్టిగానే బెదిరించారట.. దీంతో కామ్ అయిపోయి వచ్చిన కొన్ని సినిమాలు చేసింది కానీ అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు.. పైగా, ఇంకా ‘సుబ్బు’ కాంట్రవర్సీ గురించే కామెంట్స్ చేస్తుంటే.. దెబ్బకి దణ్ణం పెట్టేసి వెళ్లిపోయిందట.. అప్పట్లో ఇంత మీడియా లేదు కానీ ఉండి ఉంటే మీటూ ఉద్యమం అప్పుడే మొదలై ఉండేదేమో..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus