బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే గెలిచిన వాళ్లు టైటిల్ గెలిచినది కేవలం ఒకే ఒకసారి మాత్రమే. ఇదే చరిత్ర చెబుతోంది. ఈసీజన్ లో టిక్కెట్ టు ఫినాలే గెలిచిన శ్రీహాన్ తెగ సంబరాలు చేసుకున్నాడు. కానీ, ఈ టిక్కెట్ టు ఫినాలే గెలిచిన వాళ్లు ఎంతమంది టైటిల్ విన్నర్స్ అయ్యారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫినాలే టిక్కెట్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే దుకాణం బంద్ చేస్కుని ఖేల్ ఖతం చేస్కోవడమేనా అనేలా ఇప్పుడు తెలుగు సీజన్ నడుస్తోంది. మనం సీజన్ – 1 నుంచీ ఒక్కసారి చూసినట్లయితే.,
సీజన్ – 1 లో ఈ టిక్కెట్ టు ఫినాలే ఆదర్శ్ గెలిచాడు. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. ఈ సీజన్ లో శివబాలాజీ విన్నర్ అయ్యాడు. ఆదర్శ్ మాత్రం రన్నరప్ తోనే సరిపెట్టుకున్నాడు. తర్వాత సీజన్ – 2 లో కార్ టాస్క్ ఆడి చాలాసేపు ఉండి ఈ టాస్క్ లో సామ్రాట్ విజయం సాధించాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ టైటిల్ విన్నర్ మాత్రం కౌషల్ అయ్యాడు. సామ్రాట్ టాప్ 5లోనే మిగిలిపోయాడు.
ఇక సీజన్ – 3 లో నాగార్జున హోస్ట్ చేసిన ఫస్ట్ షోలో రాహుల్ సిప్లిగంజ్ టిక్కెట్ టు ఫినాలే గెలిచాడు. మట్టి టాస్క్ లో బాబాభాస్కర్ ని ఓడించ్ మరీ ఈ టిక్కెట్ గెలుచుకున్నాడు. అలాగే టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత సీజన్ 4 లో అఖిల్ ఇంకా సోహైల్ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా టిక్కెట్ టు ఫినాలేకి పోటీపడ్డారు. ఉయ్యాల టాస్క్ లో సోహైల్ అఖిల్ కోసం శాక్రిఫైజ్ చేసి తన ఫ్రెండ్షిప్ ని చాటుకున్నాడు. కానీ, ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ అయ్యాడు. అఖిల్ రన్నర్ గానే మిగిలిపోయాడు.
తర్వాత సీజన్ – 5 లో ఈ టిక్కెట్ టు ఫినాలేని శ్రీరామ్ చంద్ర గెలుచుకుని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. నిజానికి ఐస్ టాస్క్ లో కాళ్లు బాగా వాచిపోతే శ్రీరామ్ బదులుగా షణ్ముక్, సన్నీ ఇద్దరూ టాస్క్ ఆడి మరీ శ్రీరామ్ ని గెలిచింపి టిక్కెట్ ఇచ్చారు. కానీ, శ్రీరామ్ మూడోపొజీషన్ లోనే మిగిలిపోయాడు. ఇప్పుడు సీజన్ 6లో శ్రీహాన్ ఈ టిక్కెట్ గెలుచుకున్నాడు. సెంటిమెంట్ ప్రకారం చూస్తే థర్డ్ ప్లేస్ లో ఉంటాడా., లేదా రన్నరప్ అవుతాడా.,
లేదా రాహుల్ సిప్లిగంజ్ లాగా చరిత్రని తిరగరాస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కేవలం సీజన్ – 3లోనే టిక్కెట్ టు ఫినాలే విన్నర్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. మిగతా అన్ని చోట్లా కూడా ఓడిపోయాడు. మరి శ్రీహాన్ గెలిచి ఓడిపోతాడా.. లేదా టైటిల్ ఎగరేసుకుపోతాడా అనేది చూడాలి. నిజానికి సెంటిమెంట్ గా చూస్తే టిక్కెట్ టు ఫినాలే గెలిచిన వాళ్లు ఓడిపోవడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!