విజయ్ దేవరకొండ.. మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న హీరో. స్టార్ హీరోల లిస్టులో చేరడానికి.. అతనికి కొంచెం టైం పడుతుంది. చాలా కొంచెం టైం మాత్రమే. ఎందుకంటే.. 2018లో వచ్చిన ‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత అతనికి హిట్టు పడలేదు. సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడం వల్లో లేక విజయ్ ఎంచుకున్న కథల్ని.. దర్శకులు సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లనో.. కానీ, ఈ 6 ఏళ్ళలో అతనికి ఒక్క హిట్ కూడా పడలేదు.
కానీ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ మార్కెట్.. సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అతను ఒక్కో ప్రాజెక్టుకి రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ నిన్న అంటే మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమా రీ- రిలీజ్ అయ్యింది. 10 ఏళ్ళ క్రితం ఇదే డేట్ కి ఆ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి నిన్న ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అతి కీలకమైన పాత్ర చేశాడు. నాని (Nani) వంటి నేచురల్ స్టార్ ని డామినేట్ చేసే విధంగా ఆ పాత్ర ఉందనే అప్రిసియేషన్ వచ్చింది. అయితే నిన్న ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ తో పాటు 10 ఇయర్స్ ఫర్ విజయదేవరకొండ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా కొందరు ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి విజయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 12 ఏళ్ళు దాటింది.’ఎవడే..’ కంటే ముందే అతను ‘నువ్విలా’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి సినిమాల్లో నటించాడు..!
సో 10 ఏళ్ళు అయ్యిందని ఎలా ప్రమోట్ చేసుకుంటారు? అంతేకాదు నిన్న సోషల్ మీడియాలో ఎక్కడా కూడా నాని అభిమానుల హడావుడి కనిపించలేదు. పూర్తిగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హడావిడే కనిపించింది. ఈ హడావిడి అంతా.. ‘విజయ్ ప్లాప్స్ ను మరిపించేందుకు అతని ఫ్యాన్స్ స్ట్రాటజీ అనుకోవాలా?’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వాస్తవం ఏమై ఉంటుందో..!