Balakrishna, Jr NTR: ఫ్లెక్సీల గొడవ.. బాలయ్యని ట్రోల్ చేయడం సరికాదా..!

ఈరోజు దివంగత స్టార్ హీరో, మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్ళిన బాలయ్య.. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి మండిపడ్డారు. అంతేకాదు.. ‘వెంటనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలని బాలయ్య ఆదేశించారు. తర్వాత అతని అనుచరులు తీయించేశారు కూడా..! దీంతో ఇప్పుడు బాలయ్య పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. ఎక్కువగా బాలయ్యని ట్రోల్ చేస్తుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరోపక్క కామన్ ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ పై సింపతీ కురిపిస్తున్నారు. అలా ఈ టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది అనే చెప్పాలి. అయితే ఇక్కడో చిన్న విషయాన్ని గమనించాలి. తప్పంతా బాలయ్యదే అనడం కరెక్ట్ కాదు. గతేడాది మే 20 న.. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు’ ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు రామ్ చరణ్, డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు కూడా హాజరయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందినా, అతను హాజరు కాలేదు. అదే రోజు బర్త్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ వేడుకకు స్కిప్ కొట్టాడు. అంతకు ముందు ఎన్టీఆర్ జయంతి రోజున టీడీపీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన పూల మాలను కూడా పక్కన పెట్టేశాడు ఎన్టీఆర్. ఇక 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ పార్టీ ప్రచారానికి ఎన్టీఆర్ చాలా దూరంగా ఉన్నాడు. ప్రచారానికి ఆహ్వానించినా వెళ్ళింది లేదు.

అలాంటివి అన్నీ (Balakrishna) బాలయ్యకి కోపం తెప్పించాయి. మొన్నామధ్య ఓ ప్రెస్ మీట్లో కూడా ఎన్టీఆర్ గురించి ప్రస్తావించగా.. ‘బ్రో ఐ డోంట్ కేర్’ అంటూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు మరోసారి బయటపెట్టాడు. బాలయ్య మనసులో ఏమీ పెట్టుకోడు.. ఏదున్నా బయటపెట్టేస్తాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది అదే. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక బాలయ్య వద్దకు వెళ్లి కలిస్తే.. ఆ కోపం ఏమీ ఉండకపోవచ్చు. కానీ అందరూ ఇప్పుడు బాలయ్య వైపే వేలెత్తి చూపిస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus