Balayya Babu: బాలయ్య సినిమాలో కట్టప్ప తరహా పాత్రలో కనిపించే నటుడు అతనేనా?

బాలయ్య (Balayya Babu) బాబీ (B0bby) కాంబినేషన్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. బాలయ్య ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనా ఈ సినిమా అవుట్ పుట్ మాత్రం అద్భుతంగా ఉండనుందని సమాచారం అందుతోంది. అయితే బాలయ్య బాబీ కాంబో మూవీ గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon) కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. హీరోకు వెన్నుపోటు పొడిచే పాత్రలో ఈ నటుడు కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్ ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకునిగా , నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్నారు. నటుడిగా సైతం వరుస ఆఫర్లను అందుకుంటూ గౌతమ్ మీనన్ ఆకట్టుకుంటున్నారు. గౌతమ్ మీనన్ తన సినీ కెరీర్ లో క్లాస్ కథలలో ఎక్కువగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

బాలయ్య బాబీ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇతర భాషల్లో సైతం విడుదల కానుండటం ఈ సినిమాకు ఎంతో ప్లస్ కానుందని చెప్పవచ్చు. బాలయ్య కెరీర్ పరంగా టాప్ లో ఉండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బాలయ్య త్వరలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ పరంగా సరైన దారిలో వెళ్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య బాబీ కాంబో సినిమాలో బాలయ్య అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది. బాలయ్య సినిమాలో కట్టప్ప తరహా రోల్ లో గౌతమ్ మీనన్ కనిపించనున్నారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus