Adipurush: టాలీవుడ్ స్టార్ హీరో చరణ్ ఆదిపురుష్ 10,000 టికెట్లు కొన్నారా?

ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా అభిమానులు సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఆదిపురుష్ మూవీ 10,000 టికెట్లను కొన్నాడని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అనాథ పిల్లల కోసం చరణ్ ఈ టికెట్లను కొనుగోలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న వార్త అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండగా చరణ్ లేదా చరణ్ టీమ్ నుంచి ఈ వార్తకు సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి కొన్ని ఫేక్ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ వార్తకు సంబంధించి స్పష్టత రావాలంటే మాత్రం మరి కొన్నిరోజులు ఆగాల్సిందే. 10,000 టికెట్లను కొనుగోలు చేయాలంటే దాదాపుగా 20 లక్షల రూపాయల నుంచి 30 లక్ష్హల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆదిపురుష్ (Adipurush) సినిమాకు సంబంధించి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు 10,000 టికెట్లు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ వార్త జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. టీ సిరీస్ నిర్మాతలు ఈ సినిమా కోసం డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరుగుతోంది.

ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుండగా రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus