Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ థియేట్రికల్ హక్కుల టార్గెట్ అన్ని రూ.కోట్లా?

  • October 10, 2023 / 06:08 PM IST

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్యకు జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటివరకు 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ ను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య, కాజల్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉండదని ప్రచారం జరుగుతోంది.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలలో బాలయ్య, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉన్నా ఆ ట్రాక్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. భగవంత్ కేసరి థియేట్రికల్ హక్కులు 62 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. బాలయ్య సులువుగానే ఈ టార్గెట్ ను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా (Bhagavanth Kesari) బుకింగ్స్ ఇప్పటికే మొదలైన చోట బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలయ్య కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య త్వరలో భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం.

చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా కెరీర్ పరంగా కూడా బాలయ్యకు కలిసొస్తోంది. సోషల్ మీడియాలో సైతం బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus